మంగళవారం 02 మార్చి 2021
Rajanna-siricilla - Jan 25, 2021 , 02:39:31

అన్ని రంగాల్లో రాణించాలి

అన్ని రంగాల్లో రాణించాలి

వేములవాడ/ సిరిసిల్ల టౌన్‌/కోనరావుపేట, జనవరి 24: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని వైద్యురాలు శోభారాణి పిలుపునిచ్చారు. బాలికల దినోత్సవం సంద ర్భంగా జిల్లా మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఇక్కడ వైస్‌ ఎంపీపీ సుమలత, హెచ్‌ ఎం శారద, వైద్యులు లీలా, శిరీష, మంజుల, అరుణ, దీప్తి, గీత, వాణి, కీర్తి ఉన్నారు. అలాగే వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు నాగమల్ల శ్రీనివాస్‌-పద్మలత దంపతులు మల్లేశం-లక్ష్మి దంపతుల కూతురు మణిసాయి చందనను సత్కరించారు. ఇక్కడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, నాయబ్‌ తహ సీల్దార్‌ జ్యోతి, కౌన్సిలర్లు ముప్పిడి సునంద, కుమ్మరి శిరీష, వీ దివ్య, కృష్ణవేణి, లావ ణ్య ఉన్నారు. హెల్ఫింగ్‌ హార్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శివనగర్‌ పార్కులో బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఇక్కడ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, మానసిక వైద్య నిపుణుడు పున్నం చందర్‌, సామాజిక సేవా కార్యకర్త వేముల మార్కండేయులు తదితరులు ఉన్నారు.

VIDEOS

logo