మంగళవారం 09 మార్చి 2021
Rajanna-siricilla - Jan 24, 2021 , 03:07:48

దళిత కుటుంబాల్లో వెలుగులు

దళిత కుటుంబాల్లో వెలుగులు

బోయినపల్లి, జనవరి 23: కేసీఆర్‌ పాలనలో దళిత కుటుంబాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలపై శనివారం ఆయన బోయినపల్లిలో ఎస్సీ కార్పొరేషన ఈడీ వినోద్‌కుమార్‌తో కలిసి నిరుద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, సమైక్య పాలనలో దళితుల అభ్యున్నతిని అప్పటి పాలకులు పట్టించు కోలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రశాంత్‌, మధు, సర్పంచులు ఇల్లందుల శంకర్‌, చిందం రమేశ్‌, బూర్గుల నందయ్య, టీఆర్‌ఎస్‌ నాయకుడు కత్తెరపాక కొండయ్య ఉన్నారు.

VIDEOS

logo