‘బండి’ది తొండి రాజకీయం

- స్వార్థం కోసం దళితులతో చెలగాటం
- గ్రంథాలయ జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య
సిరిసిల్ల టౌన్, జనవరి 23: ప్రజా క్షేత్రంలో మంత్రి కేటీఆర్‌ను ఎదుర్కొనలేక ఎంపీ బండి సంజయ్ తొం డి రాజకీయాలు చేస్తున్నాడని గ్రంథాలయ పరిషత్ జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య విమర్శించారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులకు రక్షణ లేకుండాపోయిందని వాపోయారు. అదే తరహాలో ఎంపీ బండి సంజయ్ తన అనుచరులతో దళితులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. నీచ రాజకీయాలు చేస్తూ తన స్వార్థం కోసం దళితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని మండిపడ్డారు. ఇక్కడ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గడ్డం నాగరాజు, రాగుల జగన్ పాల్గొన్నారు.
దాడులపై టీఆర్ఎస్వై ఆగ్రహం
ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో దళితులపై బీజేపీ నాయకులు దాడులు చేయడంపై టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని అం బేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్వై పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలోనూ దాడులు చేసేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇల్లంతకుంట మండలం రామోజీపేట, ఎల్లారెడ్డిపేట అల్మాస్పూర్లో దళితులపై జరిగిన దాడుల్లో బీజేపీ నేతల ప్రమేయం ఉండడం సిగ్గుచేటన్నారు. ఇక్కడ కౌన్సిలర్లు రాపెల్లి దినేశ్, గెంట్యాల శ్రీనివాస్, టీఆర్ఎస్వై నాయకులు మహమూద్, తాటి వెంకన్న, మునీర్, బుర్ర కిశోర్‌గౌడ్, కత్తెర వరుణ్, తుమ్మ రాజు, సుధీర్, కూర శ్రీధర్, బాబి, రహీం, అంజద్, సిఖిందర్, అఫ్రోజ్ ఉన్నారు.
ఆద్యంతం.. ఉద్వేగం
ఎల్లారెడ్డిపేట, జనవరి 23: అల్మాస్పూర్లో దళితుల పై దాడి చేసిన 15మంది బీజేపీ నాయకులను రిమాం డ్ చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సం ఘాల, కుల వివక్ష నిర్మూలన పోరాట సమితి, ఎమ్మార్పీఎస్ మాల మహానాడు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. అదనపు కలెక్టర్ అంజయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ వచ్చి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ధర్నా విరమించలేదు. ఎడ్ల రాజ్‌కుమార్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ రాహుల్‌హెగ్డే నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. ఇక్కడ దళిత సంఘాల నాయకులు కత్తెర దేవదాస్, రాగుల రాములు, పసుల కృష్ణ, ఎడ్ల రాజ్‌కుమార్, మల్లారపు అరుణ్, ఎడవెల్లి నాగరాజు, రొడ్డ రామచంద్రం, ఎడ్ల సందీప్, శరవింద్ ములిగె ప్రమోద్, కొర్రి అనిల్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆటో ఇండస్ట్రీ ‘రైట్‌సైజింగ్’: ఆదా కోసం ఉద్యోగాలపై వేటు!
- డిజిటల్ బడ్జెట్ : అందరికీ ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్
- చిరు సాంగ్‌కు చిందేసిన మోనాల్.. వీడియో వైరల్
- కొవిడ్ టీకా తీసుకున్న డీఎంకే అధ్యక్షుడు
- అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు.. పీపీఈ కిట్‌లో అనుమానితుడు
- రోదసీలో అడుగిడిన యూరి గగారిన్ జయంతి.. చరిత్రలో ఈరోజు
- తన కుక్కల్ని వైట్‌హౌజ్ నుంచి పంపించేసిన బైడెన్
- రాహుల్‌కే పార్టీ పగ్గాలు : యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం!
- కొండగట్టు అంజన్న భక్తుల కొంగు బంగారం : ఎమ్మెల్సీ కవిత
- గుడ్‌న్యూస్.. కొవాగ్జిన్ సేఫ్ అని తేల్చిన లాన్సెట్