శనివారం 06 మార్చి 2021
Rajanna-siricilla - Jan 20, 2021 , 01:04:56

రాహుల్‌కు అండగా ఉంటాం

రాహుల్‌కు అండగా ఉంటాం

జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ

కోనరావుపేట, జనవరి 19: నాగారంలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన మ్యాకల రాహుల్‌కు అండగా ఉంటామని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. అనారోగ్యంతో వైద్యం చేయించుకోలేక జీవచ్ఛవంలా పడి ఉన్న రాహుల్‌ను మంగళవారం ఆమె పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌ వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావుకు సూచించారు. వెంటనే వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించాలన్నా రు. ఈ విషయమై ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం చేయించేందుకు కృషి చేస్తామని భరోసా కల్పించారు. ప్రభుత్వపరంగా వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు. సిరిసిల్లకు చెందిన కాయితి బాలు తన ఫేస్‌బుక్‌లో రాహుల్‌ ఆరోగ్య పరిస్థితిని పోస్ట్‌ చేయగా, విరాళంగా సమకూరిన 45వేల నగదును జడ్పీ చైర్‌పర్సన్‌ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే పలువు రు ఎన్నారైలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు 51 వేలు పంపిణీ చేశారు. ఇక్కడ ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, సెస్‌ డైరెక్టర్‌ తిరుపతి, సర్పంచ్‌ బాస లావణ్య, మాజీ వైస్‌ ఎంపీపీ తీగాల రవీందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి, సీహెచ్‌వో బాలచంద్రం ఉన్నారు.

VIDEOS

logo