బుధవారం 24 ఫిబ్రవరి 2021
Rajanna-siricilla - Jan 17, 2021 , 03:47:13

రాజన్న కోడెలకు గాలికుంటు నివారణ టీకాలు

రాజన్న కోడెలకు గాలికుంటు నివారణ టీకాలు

 వేములవాడ టౌన్‌, జనవరి 16: వేములవాడ శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చెందిన జాతర గ్రౌండ్‌లోని గోశాలలో 150 కోడెలు, 25 ఆవులకు పశువైద్యాధికారి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఆలయ ఏఈవో సంకెపల్లి హరికిషన్‌, గోశాల పర్యవేక్షకుడు బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌, గోశాల ఇన్‌చార్జి కుమార్‌, శంకర్‌, తిరుపతి, శ్రీనివాస్‌, రాజు తదితరులున్నారు. 

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

ఎల్లారెడ్డిపేట, జనవరి 16: కోరుట్లపేటకు చెందిన గరిపెల్లి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబానికి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. 

VIDEOS

logo