దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం

- వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి
సిరిసిల్ల టౌన్, జనవరి 15: సంక్షేమ పథకాల్లో సమాన అవకాశాలు కల్పిస్తూ దివ్యాంగులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం శారీరక దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీలో భాగంగా అర్హుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ కృష్ణభాస్కర్, అదనపు కలెక్టర్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళతో కలిసి వాసుదేవరెడ్డి ఎంపిక విధానాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఆసరా పథకం ద్వారా నెలనెలా రూ.3,016 పింఛన్‌ను అందించి వారికి పెద్దదిక్కుగా నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెలా ఐదు లక్షల మందికి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 1500 మందికి పింఛన్ అందిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులకు త్రీ వీలర్స్ అందించేందుకు డిగ్రీ విద్యార్హత నిబంధన పెట్టగా అనేక మంది వాహనాలు పొందలేకపోయారని, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్ విద్యార్హతతోనే వాహనాలను అందిస్తున్నారని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని పలువురు దివ్యాంగులకు ఇటీవల మంత్రి కేటీఆర్ తన సొంత ఖర్చులతో త్రీవీలర్లను అందించడం అభినందనీయమన్నారు. వికలాంగుల కార్పొరేషన్ ద్వారా త్వరలో సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా