బుధవారం 27 జనవరి 2021
Rajanna-siricilla - Jan 14, 2021 , 01:17:53

క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్‌

క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్‌

ఎంపీపీ మానస 

మండెపల్లిలో క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

సిరిసిల్ల రూరల్‌, జనవరి 13: క్రీడలతోనూ ఉజ్యల భవిష్యత్‌ ఉంటుందని ఎంపీపీ పడిగెల మానస పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మం డెపల్లిలో సర్పంచ్‌ గనప శివజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎస్‌ఐ అభిలాశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బండి దేవదాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గజభీంకా ర్‌ రాజన్నతో కలిసి ఆమె ప్రారంభించారు. మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వల్లకొండ వేణుగోపాలరావు, పడిగెల రాజు, అంకారపు రవీందర్‌, రాళ్లపేట సర్పంచ్‌ పరశురాములు, చిన్నలింగాపూర్‌ సర్పంచ్‌ అవినాష్‌రెడ్డి, బాబు, మదన్‌రెడ్డి, కిష్టారెడ్డి, లింగంపల్లి రాజు, ఉపసర్పంచ్‌ రాములు తదితరులు ఉన్నారు.


logo