ఈ చిరుత ఎక్కడిది?

అటవీ ప్రాంతంలేని మండలంలో ఒక్కసారిగా కలకలం
మల్కాపూర్‌లో వ్యవసాయ బావిలో పడ్డ వైనం
భయాందోళనలో గ్రామస్తులు
బోయినపల్లి, జనవరి 13: బోయినపల్లి మండలంలో చిరుత కలకలం రేపింది. మల్కాపూర్‌లో బుధవారం ఓ వ్యవసాయబావిలో పడి దడ పుట్టించింది. అయితే బోయినపల్లి మండలం అటవీప్రాంతం కాకపోవడం, గతంలో ఎప్పుడూ సంచరించిన దాఖలాలు లేకపోవడంతో ఇంతకీ ఈ చిరుత ఎక్కడి నుంచి వచ్చిందనే ఆందోళన మండలంలో మొదలైంది. మల్కాపూర్ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఫారెస్ట్ ఉంటుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ, వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్, నూకలమర్రి, చందుర్తి మండలంలో అటవీ ప్రాంతాలుంటాయని వేములవాడ ఫారెస్ట్ సెక్షన్ అధికారి సౌమ్య తెలిపారు. ఐదు నెలల క్రితం చందుర్తి మండలం తిమ్మాపూర్ గుట్ట పైన అటవీ శాఖ ఆధ్వర్యంలో చేసిన ప్లాంటేషన్‌లో చిరుత పులి అడుగులు కనిపించాయని గ్రామస్తులు తెలిపినట్లు ఆమె చెప్పారు. కొడిమ్యాల, చందుర్తి అటవీ ప్రాంతంలో ఉన్న చిరుత పులి ఇక్కడికి వచ్చి వ్యవసాయ బావిలో పడి ఉండవచ్చని ఆమె చెప్పారు. మల్కాపూర్ గ్రామానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎఫ్ఆర్వో శ్రీనివాస్, స్పెషల్ పార్టీ నిజామొద్దీన్, మోహన్‌లాల్, అటవీ శాఖ సెక్షన్ అధికారులు శ్రీనివాస్, సౌమ్య, శ్రీనివాస్, బీట్ ఆఫీసర్లు అనిత, సమీన సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
- తెలంగాణ క్యాడర్‌కు 9 మంది ఐఏఎస్‌లు
- నాగోబా జాతర రద్దు
- బైడెన్ ప్రమాణస్వీకారం రోజు శ్వేతసౌధాన్ని వీడనున్న ట్రంప్
- హైకోర్టులో 10 జడ్జి పోస్టులు ఖాళీ
- నేటి నుంచి గొర్రెల పంపిణీ
- రాష్ట్రంలో చలి గాలులు
- వెనక్కి తగ్గిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీ అమలు వాయిదా
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని
- స్పుత్నిక్-వీ మూడో విడత ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి
- అడవి అందాలను ఆస్వాదిద్దాం!