గురువారం 04 మార్చి 2021
Rajanna-siricilla - Jan 01, 2021 , 03:26:06

పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలి

పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలి

  • 5ఎస్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
  • ఎస్పీ రాహుల్‌ హెగ్డే
  • సిరిసిల్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

సిరిసిల్ల రూరల్‌, డిసెంబర్‌ 31: పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలని, 5ఎస్‌ విధానాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే ఆదేశించారు. గురువారం సిరిసిల్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఠాణాలో కలియ తిరిగి పరిశీలించారు. సర్కిల్‌ కార్యాలయంలోని గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ సీడీ ఫైల్స్‌ను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న కేసులను పూర్తి చేయాలన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డయల్‌ 100కు వచ్చే కాల్స్‌కు సత్వరం స్పందించాలన్నారు. బ్లూకోల్ట్స్‌, పెట్రో కార్‌ నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని, తదితర సూచనలు చేశారు. ఆయన వెంట సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ వెంకటనర్సయ్య, ఎస్‌ఐలు రాజశేఖర్‌, సుధాకర్‌, సిబ్బంది ఉన్నారు.

నేరాల నియంత్రణకు సహకరించాలి

ఎల్లారెడ్డిపేట, డిసెంబర్‌ 31: నేరాల నియంత్రణ ప్రజలు సహకరించాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే పిలుపునిచ్చారు. గురువారం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో సీసీ కెమెరాలను ఎంపీపీ పిల్లి రేణుక, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలోని 14 కూడళ్లలో 42 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంపై సర్పంచ్‌ను అభినందించారు. ఇందులో డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ బన్సీలాల్‌, ఎస్‌ఐ వెంకటకృష్ణ, ఎంపీటీసీ ఇల్లెందుల గీతాంజలి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, నాయకులు ముత్యాల శేఖర్‌రెడ్డి, ఇల్లెందుల శ్రీనివాస్‌రెడ్డి, వినోద్‌, నవీన్‌ పాల్గొన్నారు. 


VIDEOS

తాజావార్తలు


logo