కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ . 2018లో బాక్సాఫీస్ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా చాప్టర్ 2 రూపొందుతుంది. ఇందులో రాఖీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్ హీరో సంజయ్‌దత్. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్ 2 విడుదల కానుంది.
సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ మూవీ నుండి మరో అప్డేట్ ఇచ్చింది.ఇనాయత్ ఖలీల్ క్యారెక్టర్‌ను పోషిస్తున్న బాలకృష్ణ పోస్టర్‌ను పేపర్ కట్టింగ్ రూపంలో విడుదల చేశారు. గుర్తుతెలియని ప్రాంతంలో ఇనాయత్ ఖలీల్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటూ చిత్ర బృందం పేర్కొంది. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.