బుధవారం 27 జనవరి 2021
Rajanna-siricilla - Dec 06, 2020 , 01:20:32

యాదవుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

యాదవుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

సిరిసిల్ల రూరల్‌: యాదవుల ఆర్థికాభివృద్ధే ప్రధాన లక్ష్యమని యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఆసరి బాలరాజు యాదవ్‌ పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాలరాజుయాదవ్‌ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు మేకల రాములుయాదవ్‌ శనివారం ఉత్వర్వులు జారీ చేశారు. నియామక పత్రాన్ని జిల్లా నాయకుల సమక్షంలో బాలరాజుకు అందజేశారు. అనంతరం అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాలరాజు యాదవ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరవేని మల్లేశ్‌ యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు జగ్గాని మల్లేశంయాదవ్‌, జిల్లా ప్రచార కార్యదర్శి రాజలింగం యాదవ్‌, జిల్లా కోశాధికారి బొబ్బల మల్లేశం యాదవ్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు దొంతుల ఆంజనేయులు, సిరిసిల్ల నియోజవర్గ ఇన్‌చార్జి సందవేని రాజుయాదవ్‌, సిరిసిల్ల పట్టణ గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌, గోగు మల్లేశ్‌యాదవ్‌, కాల్వ దేవయ్య, తిరుపతి, రాజు ఉన్నారు.logo