నేతన్నకు తీపి కబురు

- రూ. 1.53 కోట్ల యారన్ సబ్సిడీ విడుదల
- మొదటి, రెండు విడుతల్లో 650 మందికి రూ. 98.21 లక్షల చెల్లింపు
- మూడో విడుతలో 948 మంది కార్మికులకు లబ్ధి lనేరుగా ఖాతాల్లో జమ
రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది. చీరెల యార్న్ సబ్సిడీని ఇప్పటికే రెండు విడుతల్లో ఇవ్వగా, తాజాగా మూడో విడుత విడుదల చేసి భరోసా నింపింది. యార్న్ సబ్సిడీని మూడు వేల మంది కార్మికులకు సబ్సిడీ అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1598 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తొలి రెండు విడుతల్లో 650 మందికి రూ.98.21 లక్షల సబ్సిడీ నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తాజాగా, మూడో విడుతలో 948 మందికి రూ.1.53 కోట్లు చెల్లించనున్నారు. మొత్తంగా 1598 మందికి రూ.2.52 కోట్లు విడుదల చేసింది. కాగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా మరమగ్గాల కార్మికులకు యార్న్ సబ్సిడీ ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా..
నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం యార్న్ సబ్సిడీని అందిస్తున్నది. ఇన్నాళ్లూ ఉపాధి లేక దుబాయ్, బొంబాయ్ బాట పట్టిన ఇక్కడి నేత కార్మికులకు చేతి నిండా పనికల్పించింది. పనికితగ్గ వేతనం అందేలా చర్యలు తీసుకున్నది. ఆర్వీఎం ద్వారా సర్కారు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేస్తున్న యూనిఫాంల ఆర్డర్లను ఇక్కడి కార్మికులకు అప్పగించింది. క్రిస్మస్, రంజాన్ పండుగలకు అందించే బట్టల తయారీ బాధ్యతను ఇచ్చింది. అంతేకాకుండా కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచే ఉద్దేశంతో రాష్ట్రంలోని కోటిమంది ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు కానుకగా చీరలు ఇచ్చే పథకాన్ని అమల్లో కి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన చీరెల ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అప్పగించింది. ఇంత చేసినా మరమగ్గాల యజమానులకే లబ్ధి చేకూరుతుందని భావించింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో బతుకమ్మ చీరెలకు ఇచ్చే నూలు (యార్న్) సబ్సిడీలో 10 శాతం కార్మికులు చెల్లించాలని నిర్ణయించి కార్మికుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
నేరుగా ఖాతాల్లోకి...
సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు యార్న్ సబ్సిడీని నేరుగా ఖాతాల్లో జమ చేయాలని మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి వెంటనే ఆచరణలోకి తీసుకురావాలని నిర్దేశించారు. ఈ నేపథ్యంలో 2018 నుంచి బతుకమ్మ చీరెలు తయారు చేసిన కార్మికులకు 10 శాతం సబ్సిడీని అందించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని చేనేత జౌళి శాఖ అధికారులను ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో సిరిసిల్ల పట్టణం, మండలంలోని చంద్రంపేట, టెక్స్టైల్స్ పార్కులోని కార్మికుల జాబితాను రూపొందించింది. అందులో మూడు వేల మంది కార్మికులకు సబ్సిడీ ఇవ్వాలని సర్కారుకు నివేదించింది. దీని ఆధారంగా సబ్సిడీని అందజేస్తున్నది. దరఖాస్తు చేసుకున్న 1598 మందిలో మొదటి రెండు దశల్లో 650 మందికి రూ.98.21 లక్షలు, మూడోవిడతలో 948 మంది కోసం రూ. 1.53 కోట్లను శనివారం విడుదల చేసింది. వీటిని టెస్కో ద్వారా నేతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరో 1400 మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని చెప్పారు.
అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి
ప్రభుత్వం కార్మికుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నది. 10 శాతం యార్న్ సబ్సిడీని నేరుగా నేతన్నల ఖాతాల్లో జమచేస్తున్నది. మూడు వేల మంది కార్మికులకు సబ్సిడీ అందించాల్సి ఉన్నది. ఇప్పటి వరకు 1598 మందికి రూ.2.52 కోట్లు విడుదల చేసింది. అర్హులైన మిగిలిన కార్మికులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
- అశోక్‌రావు, చేనేత జౌళిశాఖ జిల్లా అధికారి
తాజావార్తలు
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
- గూగుల్ కష్టమర్లకు గుడ్ న్యూస్..!
- బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదమేనా...?
- ఇక సుంకాల మోతే: స్మార్ట్ఫోన్లు యమ కాస్ట్లీ?!
- లైట్..కెమెరా..యాక్షన్..'ఖిలాడి' సెట్స్ లో రవితేజ
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్‌రామ్ పిటిషన్