మంగళవారం 26 జనవరి 2021
Rajanna-siricilla - Dec 05, 2020 , 01:15:48

రుణాలు మంజూరు చేయాలి

రుణాలు మంజూరు చేయాలి

  • నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకోవాలి
  • కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌
  • అధికారులతో సమీక్షా సమావేశం

రాజన్నసిరిసిల్ల, నమస్తేతెలంగాణ/కలెక్టరేట్‌:వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్ణయించిన రుణాలను జిల్లాలోని మహిళా సంఘాలకు ఈ నెలాఖరులోగా మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా లీడ్‌ బ్యాంక్‌ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, అన్ని బ్యాంకుల మేనేజర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, 2020 సంవత్సరానికి గానూ జిల్లాలోని 7,625 మహిళా సంఘాలకు రూ.232.54 కోట్ల రుణాలు మంజూరు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. ఈ మేరకు నవంబర్‌ చివరి వరకు 6,245 సంఘాలకు రూ.172.30 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్‌ చివరి వరకు వంద శాతం రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు బ్యాంక్‌ అధికారులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. అలాగే బ్యాంక్‌ అధికారులకు కూడా జిల్లా యంత్రాంగం తరఫున సహాయ సహకారాలు ఉం టాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రంగారెడ్డి, డీఆర్‌డీవో కౌటిల్యారెడ్డి, బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు. logo