మంగళవారం 19 జనవరి 2021
Rajanna-siricilla - Dec 05, 2020 , 01:15:36

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ కల్చరల్‌ : కార్తీక శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది.  స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేకువజామునుంచే బారులు తీరారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కల్యాణం మొక్కులు, చండీహోమం ఘనంగా నిర్వహించుకున్నారు. 

రాజన్నను దర్శించుకున్న ప్రముఖులు 

స్వామివారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌  గండ్ర జ్యోతి, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఎన్‌ఆర్‌కే రెడ్డి దర్శించుకున్నారు.   ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి కోడెమొక్కు చెల్లించుకున్నారు.