శనివారం 16 జనవరి 2021
Rajanna-siricilla - Dec 03, 2020 , 02:02:26

వేగంగా కరోనా పరీక్షలు

వేగంగా కరోనా పరీక్షలు

కరోనా కట్టడికి వైద్యఆరోగ్య విభాగం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. రెండో దశ వ్యాప్తి చెందే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్న  నేపథ్యంలో ముందస్తుగానే అప్రమత్తమైంది. వేములవాడ బల్దియా పరిధిలో కొవిడ్‌ పరీక్షల్లో వేగం పెంచింది. ఈ దిశగా కాలనీలవారీగా ప్రత్యేక బృందాలను నియమించింది. ఇప్పటికే 6794 మందికి టెస్ట్‌లు చేసింది. 

                                                                                                                                                                                                                                                            -వేములవాడ 

  • వైరస్‌ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు
  • కాలనీల వారీగా ప్రత్యేక కేంద్రాలు
  • పీహెచ్‌సీ పరిధిలో 6794 టెస్ట్‌లు

వేములవాడ: వేములవాడ ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం పరిధిలో కరోనా నిర్ధారణ  పరీక్షల్లో వేగం పెంచారు. రెండో దశ వైరస్‌ విజృంభిస్తున్నదనే వార్తల నేపథ్యంలో కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ   స న్నద్ధమైంది. ఇక వేములవాడ పురపాలక సం ఘంలో గురువారం నుంచి కాలనీల్లో ప్రత్యేక కేం ద్రాలు ఏర్పాటు చేసి పరీక్షల సంఖ్య  పెంచాలని  నిర్ణయించింది. 

బల్దియా పరిధిలో 6794 పరీక్షలు..

వేములవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇప్పటివరకు 11245 కరోనా  నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వేములవాడ  మున్సిపల్‌ పరిధిలో 6794  టెస్ట్‌లు చేశారు. అయితే తిప్పాపూర్‌లోని వంద పడకల  దవాఖానలో ప్రత్యేక కేంద్రం  ఏ ర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. ఇక నుంచి అం దరికీ అందుబాటులో పరీక్షలు చేయనున్నారు.   ఇప్పటివరకు 1819 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1690 రీకవరి అయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వేములవాడ పీహెచ్‌సీ పరిధిలో 100  యాక్టివ్‌గా  కేసులు ఉన్నాయని తెలిపారు.   ప్రస్తుత పరిస్థితుల్లో రెండోసారి కరోనా విజృంభించే  ప్రమాదం ఉన్నందున  నివారణకు వైద్యారోగ్య అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతన్నారు. లక్షణాలు ఉన్నవారు తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.  స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరుతున్నారు. 

నేడు 17వ వార్డులో..

వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని 17వ వార్డులో కరోనా పరీక్షలు నిర్వహించేందు కు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్‌ వంగల దివ్యశ్రీనివాస్‌  ముందుకు వచ్చారు. దీం తో బుధవారం కాలనీలో తిరుగుతూ ప్రజలను చై తన్యవంతం చేశారు. లక్షణాలు ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

జాగ్రత్తలతోనే నియంత్రించవచ్చు..

విస్తృతంగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా వైరస్‌ను నియంత్రివచ్చు.  ఇందులో భాగంగా  కాలనీల్లో కూడా పరీక్షలు చేసేందుకు  సిద్ధమవుతు న్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమతంగా ఉం డాల్సిన అవసరం ఉంది. మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి.

-రేగులపాటి మహేశ్‌రావు, వైద్యాధికారి, వేములవాడ