గురువారం 28 జనవరి 2021
Rajanna-siricilla - Dec 01, 2020 , 03:09:27

రాజన్న భక్తులకు యువ ఫౌండేషన్‌ సేవలు

రాజన్న భక్తులకు యువ ఫౌండేషన్‌ సేవలు

వేములవాడ: కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ  రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా యువ ఫౌండేషన్‌ సభ్యులు పోలీస్‌ వలంటీర్లుగా వారికి సేవలందించారు. స్థానిక పోలీస్‌లతో కలిసి ట్రాఫిక్‌, క్యూలైన్‌ వద్ద విధుల్లో దాదాపు 25 మంది పాల్గొన్నారు. ఫౌండేషన్‌ ఉపాధ్యక్షుడు బొంగాని శ్రీకాంత్‌ మాట్లాడుతూ, పోలీస్‌, ఆర్మీ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు వలంటీర్‌గా అవకాశం కల్పించడంపై టౌన్‌ సీఐ వెంకటేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్‌ జనరల్‌ సెక్రటరీ గడ్డం ప్రశాంత్‌, తదితరులున్నారు.


logo