కమనీయం.. కార్తీక పున్నం

- ఆలయాలకు పోటెత్తిన భక్తులు
- శివనామస్మరణతో మార్మోగిన రాజన్న క్షేత్రం
- ధర్మపురి నర్సన్నకు తాకిడి.. గోదావరిలో పుణ్యస్నానాలు
- కన్నులపండువగా జ్వాలా తోరణం
వేములవాడ కల్చరల్/ధర్మపురి: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. ప్రత్యేక పూజలు చేసి ఇష్టదైవాన్ని స్మరించుకున్నది. వేములవాడ రాజన్న ఆలయం ఉదయం నుంచే కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50వేల మంది తరలివచ్చారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కల్యాణాలు, చండీహోమాలు నిర్వహించుకున్నారు. కాగా, రాజన్న అనుబంధ ఆలయాల్లోనూ రద్దీ కనిపించింది. వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో సీఐ వెంకటేశ్ బందోబస్తును కల్పించారు. కాగా, రాత్రి రాజన్న ఆలయ అద్దాలమండపంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో మహాలింగార్చనను, జ్వాలాతోరణాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు పల్లకిసేవ జరిపారు. చివరగా ఆలయంలో దీపోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్, ఏఈవో సంకెపల్లి హరికిషన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఉన్నారు.
ధర్మపురిలో వైభవంగా..
ధర్మపురి నృసింహుడి క్షేత్రం వేలాది మంది భక్తులతో పులకించింది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, తదితర రాష్ర్టాల నుంచి తరలివచ్చి, గోదావరిలో స్నానం చేసి, స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి కార్తీక దీపాలు వెలిగించి, వేద బ్రాహ్మణులకు దీపదానం చేశారు. సీఐ రా మ్చందర్రావు ఆధ్వర్యంలో ఎస్ఐ కిరణ్‌కుమార్, బందోబస్తు చర్యలు చేపట్టారు. రాత్రి బ్రహ్మ పుష్కరిణిలో పంచసహస్ర దీపాలంకరణను వైభవంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు బొజ్జ రమేశ్ శర్మ, తదితర వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో బ్రహ్మపుష్కరిణిలోని బోగమండపంలో లక్ష్మీనృసింహుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. వేడుకలకు జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, కలెక్టర్ రవి, అడిషనల్ కలెక్టర్ రాజేశం, ఈఓ శ్రీనివాస్ హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి దీపాలంకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాజావార్తలు
- రైలు కింద పడి నలుగురి ఆత్మహత్య
- గుంత కనిపిస్తే..అధికారులకు జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ వార్నింగ్
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరవాసుల యాదిలోకి మరోసారి డబుల్ డెక్కర్ బస్సు
- నేడు లాజిస్టిక్ పార్క్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- పెళ్లాం కదా అని కొడితే కటకటాలే...
- దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు
- శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ గిఫ్ట్..
- వార్తలలోకి 'మనం 2'.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం