సోమవారం 18 జనవరి 2021
Rajanna-siricilla - Nov 30, 2020 , 01:43:54

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

సిరిసిల్ల రూరల్‌: పాఠశాలలో తమతో కలిసి చదువుకున్న సహచరుడు మృతి చెందగా అతడి కుటుంబానికి స్నేహితులు ఆర్థిక సాయం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన కాసారపు చంద్రయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆదివారం బాధిత కుటుంబాన్ని ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ 1995 ఎస్సెస్సీ బ్యాచ్‌ విద్యార్థులు పరామర్శించారు. రూ.50వేల నగదు అందజేశారు.