అప్పులు తీర్చే దారిలేక..

- వేర్వేరు చోట్ల ఇద్దరి బలవన్మరణం
- బాధిత కుటుంబాల్లో విషాదం
వేములవాడ రూరల్/ బోయినపల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు బలవన్మర ణానికి పాల్పడ్డా రు. వేములవాడ రూరల్ మండలం బాలరాజుపల్లికి చెందిన నాగర్ల పద్మ (24) అనే వివాహిత ఉరేసుకున్నదని వేములవాడ రూరల్ ఎస్ఐ సౌమ్య పేర్కొన్నారు. పద్మ భర్త రవి నాలుగు నెలల క్రి తం దుబాయ్ నుంచి తిరిగివచ్చాడు. దుబాయ్ వెళ్లేందుకు చేసిన అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదకు గురై ఆత్మహత్య చేసుకున్నది. పద్మకు కూతురు, కొడుకు ఉన్నారు. పద్మ తల్లితండ్రులు రేణు-పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పా రు. మృతురాలికి కుతూరు, కోడుకు ఉన్నారు.
శాభాష్‌పల్లి వంతెనపై నుంచి దూకి..
బోయినపల్లి మండలం శాభాష్‌పల్లి హైలెవల్ వంతెన కింద నీళ్లలో పడి ఆత్మహత్య చేసు కున్న వ్యక్తిని పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రంగు రవీందర్(62)గా గుర్తించినట్లు ఏఎస్ఐ చంద్రమౌళి తెలిపారు. రవీందర్ జ్యువెల్లరీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. ఆయనకు భార్య దేవిక, ముగ్గురు ఆడ పిల్లలున్నారు. ఇప్పటికే ఇద్దరు కూతుర్ల వివాహం చేశాడు. కరోనా నేపథ్యంలో జ్యువెల్లరీ పనులు సాగకపోవడంతో కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. తీర్చే దారిలేకపోవడం తో తీవ్ర మనసా ్తపానికి గురయ్యాడు. బుధవా రం కుటుంబసభ్యులకు చెప్పకుండా ఇంటి నుం చి వచ్చాడు. గురువారం సాయంత్రం శాభాష్‌పల్లి హైలెవల్ వంతెన కింద నీళ్లపై మృత దేహం తేలగా గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తను చూసిన బంధువులు ఆయన భార్య దేవికకు సమచారమిచ్చారు. శుక్రవారం దేవిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐతెలిపారు.
తాజావార్తలు
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
- బస్‌కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి
- మూడో వికెట్ కోల్పోయిన భారత్