శనివారం 23 జనవరి 2021
Rajanna-siricilla - Nov 27, 2020 , 00:16:50

వైభవంగా తులసీ కల్యాణం..

వైభవంగా తులసీ కల్యాణం..

వేములవాడ కల్చరల్‌: శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో శ్రీ కృష్ణ తులసీ కల్యాణం గురువారం కన్నులపండువగా నిర్వహించారు. చిలుకు (కార్తీక) ద్వాదశి సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు విఠలేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కృష్ణ తులసీ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ విఠలేశ్వరస్వామి వారికి, శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీలక్ష్మీ అనంతపద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్‌ ద్వారా అభిషేకం నిర్వహించారు. ఆలయ అధికారులు,భక్తులు పాల్గొన్నారు. logo