గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగరేస్తాం

- రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ శ్రేణుల విస్త్రృత ప్రచారం
సిరిసిల్ల రూరల్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాదీలు టీఆర్ఎస్కే పట్టం కట్టనున్నారని, గ్రేటర్‌పై గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గ్రేటర్ హైదరాబాద్‌లోని 123 డివిజన్లో ఎన్నికల ప్ర చారంలో పాల్గొన్న సిరిసిల్ల నియోజవర్గ నేతలతో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు. కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్న చర్యలపై వివరించాలన్నారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, పడిగెల రాజు, దడిగెల శ్రావణ్‌రావు, సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డి, అంకారపు రవీందర్, కర్కబోయిన కుంటయ్య, అబ్బాడి అనిల్‌రెడ్డి, రవి, మోతె మహే శ్, బైరి రమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.