ఆదివారం 24 జనవరి 2021
Rajanna-siricilla - Nov 26, 2020 , 00:37:22

మంత్రి కేటీఆర్‌కు ‘సిరిసిల్ల’ పట్టు వస్త్రం

మంత్రి కేటీఆర్‌కు ‘సిరిసిల్ల’ పట్టు వస్త్రం

కలెక్టరేట్‌: ప్రముఖ నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ పట్టుతో నేసిన వీవీఐపీ శాలువాను బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ వైస్‌ప్రెసిడెంట్‌ చాముండేశ్వరీనాథ్‌ బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. కొద్దిరోజుల క్రితం హరిప్రసాద్‌ పట్టు చీరపై ‘వినాయకుడి ప్రతిమ’ వచ్చేలా తయారు చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయానని, ఈ క్రమంలో ప్రత్యేకంగా వీవీఐపీ శాలువాను తయారు చేయించినట్లు చాముండేశ్వరీనాథ్‌ మంత్రికి తెలిపారు. వినాయకుడి ప్రతిమ ఉన్న పట్టుచీరను ఇటీవలే సచిన్‌ టెండూల్కర్‌కు అందజేశానని చెప్పగా, చాలా బాగా తయారు చేశాడంటూ మంత్రి అభినందించారు. కాగా, తాను నేసిన శాలువా మంత్రి కేటీఆర్‌కు, వినాయకుడి ప్రతిమ ఉన్న పట్టు వస్త్రం క్రీడాకారుడు సచిన్‌కు చేరడంపై హరిప్రసాద్‌ సంతోషం వ్యక్తం చేశారు.


logo