బుధవారం 20 జనవరి 2021
Rajanna-siricilla - Nov 25, 2020 , 00:07:52

మండల సమగ్రాభివృద్ధే ధ్యేయం

మండల సమగ్రాభివృద్ధే ధ్యేయం

సిరిసిల్ల రూరల్‌:  మండల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస అన్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతోనే తంగళ్లపల్లి మండలం ప్రగతి పథంలో నడుస్తున్నదని పేర్కొన్నారు. మంగళవారం తంగళ్లపల్లి మండల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ పడిగెల మానస మాట్లాడారు. మండల పరిషత్‌, 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు, వైకుంఠధామాల నిర్మాణం పూర్తి కావస్తున్నదని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందరి సహకారంతో మండలాన్ని ఆదర్శంగా నిలుపుతామని పేర్కొన్నారు. అంతకుముందు సెస్‌ చైర్మన్‌ దొర్నాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పల్లె ప్రగతిలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించామన్నారు. లో వోల్టేజీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు నిధులతోపాటు బాధ్యతలను కూడ స్వీకరించాలన్నారు. సమావేశం పూర్తికాకుండానే పలువురు ప్రజాప్రతినిధులు సమావేశం నుంచి వెళ్లిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు సహకరించాలని, త్వరగా ప్రతిపాదనలు పంపించాలని కోరారు. ఎంపీడీవో చికోటి మదన్‌మోహన్‌ మాట్లాడుతూ, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.32.55లక్షలు విడుదలయ్యాయని, వాటి వినియోగంపై వివరించారు. పలువురు సభ్యులు, పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా, అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపీపీ జంగిటి అంజయ్య, తహసీల్దార్‌ సదానందం, ఎంపీవో రాజు, ఎంఈవో రఘుపతి, వైద్యాధికారులు సుప్రియ, సంతోష్‌, బాబు, వెటర్నరీ అధికారి సంతోష్‌తోపాటు సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, ఎంపీటీసీలు ములిగే దుర్గాప్రసాద్‌, సిలువేరి ప్రసూన, నలువాల రేణుక, కనుకలక్ష్మి, కళ, స్వప్న, బైరినేని రాము, కోడి అంతయ్య, రాజిరెడ్డితోపాటు సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

ఎంపీవో తీరుపై సభలో నిరసన 

తంగళ్లపల్లి ఎంపీవో జోగం రాజు తీరు మార్చుకోవాలంటూ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు సభలో ఆరోపించారు. సర్పంచులు, సెక్రటరీలపై ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు నిరసన తెలిపారు. ఎంపీవో రాజు స్పందిస్తూ తాను పై అధికారుల ఆదేశాలనే అమలు చేస్తున్నానని స్పష్టం చేశారు. 


logo