బుధవారం 20 జనవరి 2021
Rajanna-siricilla - Nov 25, 2020 , 00:07:49

విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి

విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి

  • జిల్లా విద్యాధికారి డి రాధాకిషన్‌
  • జిల్లాస్థాయి బాలల కళాఉత్సవాలు

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: విద్యార్థులు చిన్ననాటి నుంచి అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి డీ రాధాకిషన్‌ ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో జిల్లా స్థాయి బాలల కళోత్సవాలు-2020 నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి బాలల కళోత్సవాలు చక్కని వేదికన్నారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మండలస్థాయి పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ ఆఫీసర్లు రాజేందర్‌శర్మ, రాంచందర్‌రావు, కళోత్సవం బాధ్యులు గోనే బాల్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు వీరే..

శాస్త్రీయ సంగీతగానం(బాలికలు)లో అఖిల (కేజీబీవీ గంభీరావుపేట), ఇంటర్మీడియట్‌ సెంకడ్‌ఇయర్‌. జానపద నృత్యం(బాలికలు)లో రాయల సుప్రియ కేజీబీవీ(వేములవాడ). చిత్రలేఖం(బాలికలు)లో అక్షయ , వెంకంపేట హైస్కూల్‌. హస్తకళల్లో(బాలికలు) అర్చన కేజీబీవీ, మర్రిపల్లి(వేములవాడ). చిత్రలేఖనం(బాలురు)లో ఆకాష్‌ టీఐడబ్ల్యూఈఎంఆర్‌జేసీ (కోనరావుపేట). జానపద  గానం(బాలురు)లో సాత్విక్‌ సిద్ధార్థ ఇంగ్ల్లిష్‌ మీడియం హై స్కూల్‌ సిరిసిల్ల.logo