బుధవారం 20 జనవరి 2021
Rajanna-siricilla - Nov 25, 2020 , 00:10:04

గేటర్‌లో టీఆర్‌ఎస్‌కు రజక సంఘాల సమితి మద్దతు

గేటర్‌లో టీఆర్‌ఎస్‌కు రజక సంఘాల సమితి మద్దతు

సిరిసిల్ల: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికల్లో అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌  అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి చైర్మన్‌, ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ నివాసి అక్కరాజు శ్రీనివాస్‌ తెలిపారు.  ఈ మేరకు మంగళవారం మంత్రి కేటీఆర్‌కు రజక సంఘం నేతలతో కలిసి మద్దతు పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రజకులకు పలు ప్రయోజనాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.  తామంతా ఆయనకు రుణపడి ఉంటామన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల ముఖ్య సలహాదారు కే సత్యనారాయణ, కార్యదర్శి మూస గణేశ్‌ తదితరులు ఉన్నారు.logo