ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 23, 2020 , 01:40:15

పిల్లల హక్కుల పరిరక్షణ బాధ్యత పెద్దలదే

పిల్లల హక్కుల పరిరక్షణ బాధ్యత పెద్దలదే

సిరిసిల్ల రూరల్‌: పిల్లల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత పెద్దలదేనని ప్రముఖ సైకాలజిస్ట్‌ కే పున్నంచందర్‌ అన్నారు. ఆదివారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో హెల్పింగ్‌ హార్ట్స్‌, వెల్ఫేర్‌ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సైకాలజిస్ట్‌ కే పున్నంచందర్‌ హాజరై మాట్లాడారు. బాలలకు ఆపద సమయంలో తమను తాముగా ఏవిధంగా రక్షించుకోవాలో శిక్షణ ఇచ్చారు. అలాగే ‘గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌' అంశంపై వివరించారు. అంతకుముందు 11వ వార్డు కౌన్సిలర్‌ ఓగ్గు ఉమ, సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ అలువాల ఈశ్వర్‌ మాట్లాడారు. అనంతరం సంస్థ రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోడం బాలకిషన్‌, గూడెల్లి నాగభూషణం, సామల రంజిత్‌, చింతల శరత్‌, చిలుముల రఘువరన్‌, వాసం రవి, బాలల ఫెడరేషన్‌ కన్వీనర్‌ కే సంజన పాల్గొన్నారు. 


తాజావార్తలు