ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 22, 2020 , 01:54:34

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి తరలిన నేతలు

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి తరలిన నేతలు

సిరిసిల్ల రూరల్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి సిరిసిల్ల ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివెళ్లారు. జీహెచ్‌ఎంసీలోని 123వ డివిజన్‌ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు గెలుపుకోసం శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మాట్ల మధు, నేతలు పడిగెల రాజు, తిరుపతిరెడ్డి, రంగయ్య, రమేశ్‌, అవినాష్‌, పోషయ్య, కుంటయ్య , లక్ష్మారెడ్డి, బాలయ్య, చిరంజీవి, అనిల్‌, రమేశ్‌, నవీన్‌, ఎల్లయ్య ఉన్నారు.

సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని రగుడు, చంద్రంపేట, పెద్దూరుకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు హైదరాబాద్‌ తరలివెళ్లాయి. ఇందులో కౌన్సిలర్లు పాతూరి రాజిరెడ్డి, భూక్య రెడ్యానాయక్‌, పోశవేణి ఎల్లయ్యతో పాటు ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ వెంకట రమణారెడ్డి, కంది భాస్కర్‌రెడ్డి, బాలరాజు ఉన్నారు.

గంభీరావుపేట: మండల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ నేతలు శనివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 123వ డివిజన్‌ హైదర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్యతో కలిసి నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ భూపతి సురేందర్‌, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్‌, వంగ సురేందర్‌రెడ్డి, లింగన్నగారి దయాకర్‌రావు తదితరులు ఉన్నారు.

వీర్నపల్లి : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆదివారం హైదరాబాద్‌కు తరలివెళ్లాయి. హైదర్‌నగర్‌ 123 డివిజన్‌లో పార్టీ అభ్యర్థి నార్నే శ్రీనివాసరావుకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్‌ సురేశ్‌నాయక్‌, సర్పంచులు మల్లేశం, దినకర్‌, రవి, నాయకులు శ్రీరాంనాయక్‌, రంజిత్‌, సంతోష్‌ ఉన్నారు.