శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 19, 2020 , 02:04:45

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

భూసేకరణ, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష

15 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు  

రాజన్నసిరిసిల్ల, నమస్తేతెలంగాణ/వేములవాడ రూరల్‌: మధ్యమానేరు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సర్కారు చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ముంపు గ్రామాల సమస్యలపై 15 రోజుల్లో నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ముంపు గ్రామాల సమస్యలపై బుధవారం ఇరిగేషన్‌, భూసేకరణ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన నిర్వాసితుల స్థితిగతులపై పూ ర్తిస్థాయిలో నివేదికలు కలెక్టర్‌కు అందించాలని అధికారులను ఆదేశించారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని చెప్పారు. ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కరించామని పేర్కొన్నారు. మిగిలిన వాటిని సైతం స త్వరమే పరిష్కరించాలని కోరారు. నిర్వాసితులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. కాగా బుధవారం రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ కార్యాలయంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌తో కలిసి వినోద్‌కుమార్‌ ముంపు గ్రామాల సమస్యలపై చర్చించారు. ఈసందర్భం గా ఆయన స్పందిస్తూ హైదరాబాద్‌లో భూసేకరణ, ఇరిగేషన్‌ శాఖల అధికారులతో సమీక్షిస్తానని చెప్పారు. ఆ మేరకు మరసటి రోజే అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలపై సమీక్షించారు. సమావేశంలో నీటిపారుదల భూ సేకరణ విభాగం రాష్ట్ర ఓఎస్డీ మనోహర్‌, మధ్య మానేరు ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌, ఈఈ రామకృష్ణ, జడ్పీటీసీ మ్యాకల రవి, వైస్‌ ఎంపీపీ ఆర్‌సీ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఊరడి రాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ ఊరడి ప్రవీణ్‌, సర్పంచ్‌ కొండపల్లి వెంకటరమణ, నాయకులు రేగులపాటి హరిచరణ్‌రావు, జింకవేణు పాల్గొన్నారు.