మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 18, 2020 , 02:30:58

నిరుపేదలకు అండగా ప్రభుత్వం

నిరుపేదలకు అండగా ప్రభుత్వం

  •  జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ
  •  20 మందికి సీఎంఆర్‌ఎఫ్‌   చెక్కులు అందజేత

కోనరావుపేట: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుపేదలకు ఆపద లో అండగా నిలుస్తున్నదని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ధర్మారం, కనగర్తి, కోనరావుపేట, కొలనూ ర్‌, శివంగాళపల్లి, మర్తనపేట, నాగారం, నిమ్మపల్లి గ్రామాలకు చెందిన 20మంది లబ్ధిదారులకు సుమారు రూ.3లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంగళవారం అందజేసి, మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నదన్నారు. ఆపత్కాలంలో చికిత్స కోసం నగదును అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో కూడా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ పాలనలోగడగడపకూ, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు. ఇం దులో ఎంపీపీలు ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్‌, బుర్ర వజ్ర మ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి, సర్పం చులు శ్రీనివాస్‌, ఆరె లత, తుమ్మల యమున, బాస లావ ణ్య, వంశీకృష్ణారావు, రేఖ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ తీగాల రవీందర్‌గౌడ్‌, నాయకులు తాళ్లపల్లి సతీశ్‌గౌడ్‌, తుమ్మల మహేశ్‌ ఉన్నారు.