సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 18, 2020 , 02:31:00

రైతు బాంధవుడు కేసీఆర్‌

రైతు బాంధవుడు కేసీఆర్‌

  •  ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలు
  •  ప్రకృతి వనాలతో పల్లెల్లో కొత్త కళ
  •  రాష్ట్ర ప్రణాళికా సంఘం  ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

సిరిసిల్ల రూరల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బాంధవుడు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో పూర్తయిన రైతు వేదికను మంగళవారం ఆయన స్థాని క నేతలతో కలిసి సందర్శించారు. అనంతరం ఇందిరమ్మకాలనీలో పూర్తయిన ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్క నాటారు. అనంతరం ప్రకృతి వనంలో తెలంగాణ తల్లి విగ్రహం, ప్రకృతి వనంలో వాకింగ్‌ ట్రాక్‌ను పర్యవేక్షించారు. తర్వాత సర్పంచ్‌ బైరి శ్రీవాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతు బిడ్డ కావడంతోనే అన్నదాతల కోసం రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీతోపాటు వారిని సంఘటితం చేసేందుకు వేదికలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో ప్రకృతి వనాలు, వైకుంఠధామాల నిర్మాణాలు శరవేగంగా జరుగడంతో పల్లెల్లో కొత్త కళ సంతరించుకున్నదని పేర్కొన్నారు. గ్రామీణ యువత కోసం ఓపెన్‌ జిమ్‌లు, క్రీడల కోసం ప్రాధాన్యమిస్తామన్నారు. అంతకు ముందు ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాణి మంజుల, ఎంపీటీసీ సిలువేరి ప్రసూన వినోద్‌కుమార్‌కు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. 

టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడికి పరామర్శ

టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు కాలుకు ఇటీవల గాయమైంది. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చి న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ చీర్లవంచలోని నాగరాజు ఇంటికెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం 103 ఇండ్లకు సంబంధించిన పరిహారాన్ని అందేలా చూస్తానన్నారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, జిల్లా ఇన్‌చార్జి తోట ఆగయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెన్నమనేని వెంకట్రా వు, సర్పంచులు బైరి శ్రీవాణి, జక్కుల రవీందర్‌, పుర్మాణి రాంలింగారెడ్డి, పడిగెల రాజు, గుగ్గిళ్ల అంజయ్య, సిలువేరి నర్సయ్య, బైరి రమేశ్‌, ఉప సర్పంచ్‌ సాయిరాం, వేముల శ్రీనివాస్‌, సిలువేరి చిరంజీవి, ఉమారాజు, నవీన్‌రావు, తిరుపతిరెడ్డి, అవినాష్‌రెడ్డి, సాదుల భాస్కర్‌, సంపత్‌, బ్రహ్మం తదితరులు ఉన్నారు.