బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 14, 2020 , 01:47:34

అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్‌

అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్‌

టీఆర్‌ఎస్‌ ప్రజల ప్రభుత్వం

బీజేపీ, కాంగ్రెస్‌ పేరుకే జాతీయ పార్టీలు

వాటికి జనాదరణ కరువు

అందుకే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై విమర్శలు

మరోసారి పునరావృతమైతే సహించం

తంగళ్లపల్లిలో విలేకరుల సమావేశంలో  మండిపడ్డ టీఆర్‌ఎస్‌ నాయకులు

సిరిసిల్ల రూరల్‌: “తమది ప్రజా ప్రభుత్వం.. ప్రజల కోసం పని చేస్తున్నాం.. అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్‌ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు.. కాంగ్రెస్‌, బీజేపీలు పేరుకే జాతీయ పార్టీలు, వాటికి జనాదరణ కరువు” అంటూ తంగళ్లపల్లి మండల టీఆర్‌ఎస్‌ నాయకు లు కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణులపై మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న ఆధర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గడిచిన ఆరేండ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. రైతుల కోసం రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా ప్రవేశపెట్టారన్నారు. ఇక్కడి పథకాలను మోదీ సర్కార్‌ కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ దేశానికే దిక్సూచిలా నిలిచిందన్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో అర్హులందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు అందిస్తున్నామని, అవసరమైతే స్థలం ఉన్నవారికి అక్కడే నిర్మించి ఇచ్చే యోచనలో ఉన్నారని గుర్తు చేశారు. జాతీయ పార్టీలని చెప్పుకుంటున్న కాం గ్రెస్‌, బీజేపీలు తెలంగాణకు చేసింది శూన్యమని, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన వాటా నిధులు ఇస్తున్నదని అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, పార్టీని విమర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. అంతకుముందు ఎంపీపీ పడిగెల మానస మాట్లాడుతూ  రైతులకు మద్దతు ధర కేంద్ర పరిధిలో ఉంటుందని, ప్రతిపక్షాలు గ్రహించి మాట్లాడాలన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అంద జేసిన ఘనత కేసీఆర్‌ సర్కార్‌దేనని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర చెల్లించి పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ జంగిటి అంజయ్య, సింగిల్‌విండో చైర్మన్లు బండి దేవదాస్‌, కొడూరి భాస్కర్‌గౌడ్‌, పబ్బతి విజయేందర్‌రెడ్డి, పుర్మాణి రాంలింగారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, డైరెక్టర్‌ మీరాల భాస్కర్‌ యాదవ్‌, సారంపల్లి సర్పంచ్‌ కొయ్యడ రమేశ్‌, అంకారపు రవీందర్‌, జనార్దన్‌రెడ్డి, ఎండీ హైమద్‌, నులుగొండ శ్రీనివాస్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.