సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 14, 2020 , 01:34:02

చికిత్సకు ‘రామన్న’ భరోసా

చికిత్సకు ‘రామన్న’ భరోసా

బ్రెయిన్‌ ట్యూమర్‌తో యువకుడి అవస్థలు 

రూ.3లక్షలు ఎల్‌వోసీ మంజూరు

ఎల్లారెడ్డిపేట: బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతు న్న ఓ యువకుడికి మనసున్న మంత్రి కేటీఆర్‌ ఆపన్నహస్తం అందించారు. ఎల్‌వోసీ ఇప్పించి ఆదుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌కు చెందిన భూక్యా సాయి తండ్రి నాజం అనారోగ్యంతో పదేండ్ల క్రితం మృతి చెందాడు. తల్లి ల క్ష్మి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేంది. అతడికి చెల్లెలు శ్రావణి ఉంది. తల్లి కష్టపడడం చూసి తట్టుకోలేక తాను చదువుమానేసి కూలీ పనులకు వెళ్లి తల్లికి తోడుగా నిలిచాడు. మూడేండ్ల క్రి తం బతుకుదెరువు దుబాయ్‌ వెళ్లాడు. పదినెలల క్రితం స్వగ్రామానికి తిరిగివచ్చాడు. కరోనా కారణంగా రెండు నెలల నుంచి ఇంటివద్దే ఉండిపోయాడు. ఈ క్రమంలో నెలక్రితం తీవ్రమైన జ్వరం రాగా కరీంనగర్‌ హాస్పిటల్‌లో పరీక్షలు చేసి బ్రెయిన్‌ ట్యూమర్‌ అని నిర్ధారించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌వెళ్లారు. అక్కడి వైద్యులు ఆపరేషన్‌ అవసరమని, రూ.5.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో చేతిలో చిల్లిగవ్వలేక, చేసేదేమీలేక ఇంటికి వచ్చారు. సమస్యను ఆర్బీఎస్‌ మండల కో ఆర్డినేటర్‌ రాధారపు శంకర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ రూ.3లక్షలు ఎల్‌వోసీ మంజూరు చేశారు. ఆ ఎల్‌వోసీ పత్రాన్ని అల్మాస్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు బడే రమేశ్‌ చేతులమీదుగా సాయికి అందించారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఇందులో నాయకులు మోహన్‌రెడ్డి, ములిగె ప్రమోద్‌ ఉన్నారు.