మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 13, 2020 , 02:00:49

కవయిత్రి రాజేశ్వరికి డీటీసీ అభినందన

కవయిత్రి రాజేశ్వరికి డీటీసీ అభినందన

సిరిసిల్ల టౌన్‌/తిమ్మాపూర్‌ రూరల్‌: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగ కవయిత్రి బూర రాజేశ్వరిని ఉమ్మడి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ అభినందించారు. జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో ఉంటున్న రాజేశ్వరి ఇంటికి గురువారం చంద్రశేఖర్‌గౌడ్‌ స్వయంగా వెళ్లి సన్మానించారు. తన తండ్రి మామిండ్ల రామాగౌడ్‌ పేరిట గల స్మారక సాహిత్య వేదిక ద్వారా సన్మానించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించడమే కాకుండా సంకల్ప బలంతో కవితలు రాస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న రాజేశ్వరి ఆదర్శ ప్రాయురాలని కొనియాడారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ పాఠ్యాంశంలో రాజేశ్వరి విషయాన్ని పొందుపరచడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి కొండల్‌రావు, ఏఎంఐ ప్రమీల, తదితరులున్నారు.