బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 11, 2020 , 01:14:44

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణారెడ్డి

రగుడులో కొనుగోలు కేంద్రం ప్రారంభం

సిరిసిల్ల రూరల్‌: సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడు అని, అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణారెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని రగుడులో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం  సెస్‌ చైర్మన్‌ దొర్నాల లక్ష్మారెడ్డి, ఆర్బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల సింగిల్‌ విండో చైర్మన్‌ బండి దేవదాస్‌, ఆర్బీఎస్‌ మండల కన్వీనర్‌ వొజ్జల అగ్గిరాములు, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ పోచవేని సత్య, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ బైరి ప్రభాకర్‌, పోచవేణి ఎల్లయ్య యాదవ్‌, సందవేని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు.