గురువారం 03 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 11, 2020 , 01:14:41

అభాగ్యురాలికి ఎస్పీ సాయం

అభాగ్యురాలికి ఎస్పీ సాయం

‘నమస్తే’ మానవీయ  కథనానికి స్పందన

రూ.50 వేలు, బియ్యం, దుస్తుల వితరణ

ఎల్లారెడ్డిపేట: ధైర్యం చెప్పేందుకు అత్తమామలు లేరు, భర్త కళ్లముందే మృతి చెందగా రెండేళ్ల కొడుకును పట్టుకుని బతికేదెట్లని రోదించిన ఓ అభాగ్యురాలికి ఎస్పీ రాహుల్‌ హెగ్డే మంగళవారం ఆర్థిక సాయాన్ని అందించారు. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన భిక్షపతి(35), స్వప్న దంపతులు కూలీ పని చేసుకుని ఉన్నంతలో  జీవనం గడిపేవారు. వీరికి కొడుకు అన్షిత్‌ ఉన్నాడు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో భిక్షపతికి వచ్చిన లివర్‌ వ్యాధి సంతోషాన్ని దూరం చేసింది. కాగా, భిక్షపతి వరంగల్‌లో చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఎంత అన్యాయమైపాయె దేవుడా’ పేరిట కథనం ప్రచురితమైంది. ఈవిషయాన్ని ఎస్‌ఐ వెంకటకృష్ణ ద్వా రా ఎస్పీ తెలుసుకున్నారు. తన వంతు సాయంగా బాధిత కుటుంబానికి రూ.50వేలు, క్వింటాలు బియ్యం, దుస్తులు వితరణగా అందించి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇందు లో డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ బన్సీలాల్‌, ఎస్‌ఐ వెంకటకృష్ణ, ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ ఉన్నారు.