మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 10, 2020 , 02:31:10

లక్ష్య సాధనకు కృషి చేయాలి: డీఈవో

లక్ష్య సాధనకు కృషి చేయాలి: డీఈవో

  •  డీఈవో రాధాకిషన్‌
  • విద్యార్థినికి ప్రోత్సాహక నగదు అందజేత

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: విద్యార్థుల చిన్నప్పటి నుంచి లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి డీ రాధాకిషన్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థిని రమ్య ఇటీవల బాసరలోని ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించగా విశ్రాంత ఉపాధ్యాయుడు ఆడెపు వీరయ్య, ఉపాధ్యాయుడు మల్లారపు పురుషోత్తం నగదు ప్రోత్సాహక బహుమతి డీఈవో చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. చదువుపై దృష్టిసారించి తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం భారతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాలలో ఎన్‌ఎంఎంఎస్‌ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే 30 మంది విద్యార్థులకు హెచ్‌ఎం పరబ్రహ్మమూర్తి చేతుల మీదుగా స్టడీ మెటీరియల్స్‌ అందజేశారు. ఇందులో డీఎస్‌వో ఆంజనేయులు, ఉపాధ్యాయు లు పాతూరి మహేందర్‌రెడ్డి, పురుషోత్తం, భారతి ఫౌండేషన్‌ కో ఆర్డినేటర్‌ ప్రణీత్‌రెడ్డి ఉన్నారు.