సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 10, 2020 , 02:31:10

దళారులను ఆశ్రయించవద్దు

దళారులను ఆశ్రయించవద్దు

  •  కొనుగోలు కేంద్రాలను  సద్వినియోగం  చేసుకోవాలి
  •  ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ నర్సయ్య
  •   పలు గ్రామాల్లో కేంద్రాలు ప్రారంభం

సిరిసిల్ల రూరల్‌: రైతులు దళారులను ఆశ్రయించి ధాన్యం విక్రయించవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్స య్య పేర్కొన్నారు. మున్సిపల్‌ పరిధిలోని సర్దాపూర్‌లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ వొజ్జల అగ్గిరాములుతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించా రు. పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే మద్ద తు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నదని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సూచించారు. ఇందులో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కమిషనర్‌ సమ్మ య్య, కౌన్సిలర్‌ లింగంపల్లి సత్యనారాయణ, గెంట్యాల శ్రీనివాస్‌, ఆర్పీలు, హమాలీ సంఘం నాయకులు ఉన్నారు. అలాగే సెర్ప్‌, ఐకేపీ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లెలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ పడిగెల మానస ప్రారంభించారు. మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే నని స్పష్టం చేశారు. రైతుల కోసమే ప్రభుత్వం ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసిందని సింగిల్‌విండో చైర్మన్‌ బండి దేవదాస్‌ తెలిపారు. సర్పంచ్‌ నక్క రేవతి, ఎంపీటీసీ ములిగే దుర్గాప్రసాద్‌, పడిగెల రాజు, మీరాల భాస్కర్‌ యాదవ్‌, నక్క కొమురయ్య, ఉప సర్పంచ్‌ పరశురాములు ఉన్నారు.

రైతును రాజు చేయడమే లక్ష్యం

వీర్నపల్లి: రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని జడ్పీటీసీ గుగులోత్‌ కళావతి, ఎంపీపీ మాలోత్‌ భూల పేర్కొన్నారు. రంగంపేట, ఎర్రగడ్డతండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సోమవా రం వారు ప్రారంభించారు. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని, దళారులను ఆశ్రయించి నష్టపోవద్దన్నారు. అలాగే భూక్యాతండాలో కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్‌ గుగులోత్‌ భారతి ప్రారంభించారు. ఇందులో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ నీలం రాజేశ్‌, సర్పంచులు లింగం, జగ్మల్‌, టీఆర్‌ఎ స్‌ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బోయిని రవి, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు గుగులోత్‌ కళ, నాయకులు శ్రీరాంనాయక్‌, ప్రభాకర్‌, మల్లయ్య, బుగ్గయ్య, ప్రసాద్‌, రాజ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 

దళితులపై దాడి చేస్తే సహించం

దళితులపై దాడి చేస్తే సహించేదిలేదని జడ్పీటీసీ గుగులో త్‌ కళావతి స్పష్టం చేశారు. సోమవారం ఆమె మండల కేం ద్రంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయన్నారు. రామోజీపేటలో దళితులపై దాడి చేసిన వారిని గుర్తించి శిక్షించాలన్నారు. అంతకు ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో రామోజీపేట వాహన శ్రేణిని ప్రారంభించారు. ఇందులో బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్‌ సురేశ్‌నాయక్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లారపు అరుణ్‌, బహుజన సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల అశోక్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ నీలం రాజేశ్‌ తదితరులు ఉన్నారు.