బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 09, 2020 , 02:02:50

రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌

రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌

సిరిసిల్ల రూరల్‌: సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడు అని ఎంపీపీ పడిగెల మానస కొనియాడారు. తంగళ్లపల్లి మండలంలోని బాలమల్లుపల్లెలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్యాక్స్‌ చైర్మన్‌ బండి దేవదాస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. త్వరలోనే తెలంగాణ సోనాకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుందన్నారు. రైతులు అధైర్య పడొద్దని, పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. సర్పంచ్‌ కస్తూరి లత, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజన్న, గ్రామాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకుడు తిరుపతిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.