మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 08, 2020 , 01:46:26

ఐకార్‌లో దమ్మన్నపేట వాసి ప్రతిభ

ఐకార్‌లో దమ్మన్నపేట వాసి ప్రతిభ

ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయి ప్రథమ ర్యాంకు 

సిరిసిల్ల/గంభీరావుపేట : ఐకార్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్షలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన యువకుడు ఇస్లావత్‌ రాంవిలాస్‌ పాశ్వాన్‌ (హాల్‌ టికెట్‌ నంబర్‌ టీఎల్‌0001001531) ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. ఇటీవల ఫలితాలు విడుదల కాగా, అగ్రికల్చర్‌ సీడ్స్‌ విభాగంలో ఆలిండియాస్థాయి (ఎస్టీ కేటగిరీ)లో మొదటి ర్యాంకు, జనరల్‌లో 9వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం అతడు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ సందర్భంగా పాశ్వాన్‌ను బంజా రా సేవలాల్‌ సంఘం ప్రతినిధులు బానోతు వర్జున్‌నాయక్‌, సురేశ్‌నాయక్‌, గోపీనాయక్‌, తదితరులు అభినందించారు.