సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 08, 2020 , 01:46:24

దళారులను నమ్మిమోసపోవద్దు

దళారులను నమ్మిమోసపోవద్దు

సిరిసిల్ల జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

నాంపెల్లి, సంకెపల్లిలో సీసీఐ కేంద్రాల ప్రారంభం

వేములవాడ రూరల్‌ : దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సూచించారు. శనివారం వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి, మండలంలోని సంకెపల్లిలోని జిన్నింగ్‌ కేంద్రాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని అమ్ముకోవాలనీ, రైతులకు డబ్బులను వారంలోగా అందేలా చూడాలనీ అధికారులకు సూచించారు. అనంతరం సీసీఐ కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఊరడి ప్రవీణ్‌, సర్పంచులు ఊరడి రాంరెడ్డి, జింక సునీత, రుద్రవరం సింగిల్‌ విండో చైర్మన్‌ రేగులపాటి కృష్ణదేవరావు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు ఫీర్‌మహ్మద్‌, శ్రీనివాస్‌, కమలాకర్‌, అంజయ్య, నాయకులు శేఖర్‌, మార్కెట్‌ కార్యదర్శి సత్యనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు.