సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 06, 2020 , 02:47:16

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

  • టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత చిక్కాల రామారావు
  • తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్‌లో  కొనుగోలు కేంద్రం ప్రారంభం.. రైతు వేదిక పరిశీలన

సిరిసిల్ల రూరల్‌: రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, వెలమ సంక్షేమ మండలి జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు అన్నారు. గురువారం ఆయన తంగళ్లపల్లి మండలంలోని తన స్వగ్రామమైన కస్బెకట్కూర్‌లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  సిరిసిల్ల సింగిల్‌విండో చైర్మన్‌ బండి దేవదాస్‌, వైస్‌ ఎంపీపీ జంగిటి అంజయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్క డా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు.

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత చిక్కాల రామారావు అన్నారు. కస్బెకట్కూర్‌లో రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ,  సీఎం కేసీఆర్‌ రైతులను సంఘటితం చేయడానికి వేదికలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అలాగే తంగళ్లపల్లి మండలం వేణుగోపాలపూర్‌ గ్రామానికి చెందిన జూపల్లి గోపాల్‌రావు భార్య ఇటీవల మృతి చెందగా ఆమె కుటుంబాన్ని చిక్కాల రామారావు పరామర్శించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వలకొండ వేణుగోపాల్‌రావు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి,  విండో డైరెక్టర్లు శనిగరం లక్ష్మి, బండి దేవేందర్‌ యాదవ్‌, ఉప సర్పంచ్‌ రాములు, ఇరిగాల కిషన్‌, బొమ్మవరం సాయికృష్ణ, బిజిగ పూర్ణచందర్‌, శనిగరం తిరుపతి, పొన్నం తిరుపతి, రైతులు తదితరులున్నారు.