మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 05, 2020 , 02:07:34

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

17వ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ అలెక్స్‌

 బెటాలియన్‌లో కొవిడ్‌ టెస్టింగ్‌ క్యాంప్‌ 

సిరిసిల్ల క్రైం: ప్రతి ఒక్కరూ కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని 17వ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ అలెక్స్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ పరిధిలోని సర్దాపూర్‌లో గల 17వ పోలీస్‌ బెటాలియన్‌లో తంగళ్లపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో బుధవారం కొవిడ్‌-19 టెస్టింగ్‌ క్యాంప్‌ను నిర్వహించారు. కమాండెంట్‌ అలెక్స్‌తోపాటు అధికారులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారి సంతోష్‌తోపాటు సిబ్బందికి అభినందనలు తెలిపా రు. ఇందులో అడిషనల్‌ కమాండెంట్‌ పెద్దబాబు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ కాళీదాస్‌, జవహర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ కరుణాకర్‌, ఆర్‌ఐలు శంకర్‌, రాజేందర్‌, మోతీరాం, శ్రీధర్‌ ఉన్నారు.