సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 04, 2020 , 02:10:09

కరోనా రహితమే లక్ష్యం

కరోనా రహితమే లక్ష్యం

ఆశ, ఏఎన్‌ఎంల సేవలు భేష్‌

జిల్లా  మలేరియా ప్రోగ్రాం అధికారి శ్రీరాములు

ఎల్లారెడ్డిపేట: కరోనా రహిత గ్రామాలే లక్ష్యంగా వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించాలని జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారి శ్రీరాములు పిలుపునిచ్చా రు. మండల పరిషత్‌లో మంగళవారం వైద్య సిబ్బందికి మలేరియా, కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. వీర్నపల్లికి కరోనా రహిత మండలంగా జిల్లాలో గుర్తింపు లభించిందని, ఇందుకు ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎం, వైద్యాధికారులు ధర్మానాయ క్‌, మానస చేసిన కృషి మరువలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.