ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 04, 2020 , 02:10:09

రాజన్న హుండీ ఆదాయం 78.85లక్షలు

రాజన్న హుండీ ఆదాయం 78.85లక్షలు

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి హుండీ ఆదాయం రూ.78లక్షల 85వేల 912 సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ వెల్లడించారు. మంగళవారం ఆలయ ఓపెన్‌స్లాబ్‌పైన హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగిందని చెప్పారు. ఇందులో 124 గ్రాముల బంగారం, 6.5 కిలోగ్రాముల వెండి సమకూరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ  అధికారులు, సిబ్బంది, సత్యసాయి సేవాసమితి సభ్యులు తదితరులున్నారు.