శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 03, 2020 , 01:45:15

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కౌన్సిలర్‌ గెంట్యాల శ్రీనివాస్‌ వితరణ చేసిన నోట్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమానికి డీఈవో రాధాకిషన్‌తో కలిసి హాజరై, మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువాలన్నారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తున్న కౌన్సిలర్‌ ఇదే పాఠశాలలో చదువుకున్నారని గుర్తు చేశారు. అనంతరం శ్రీనివాస్‌ను డీఈవో అభినందించారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ తిరుపతి, ఉపాధ్యాయులు ఉన్నారు. 

డిక్షనరీల పంపిణీ

పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఏకరూప దుస్తువులు, గీవ్‌ తెలంగాణ ఆధ్వర్యం లో డిక్షనరీలను కౌన్సిలర్‌ విజయ నిర్మల పంపిణీ చేశారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలతోపాటు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో హెచ్‌ంఎ మోతిలాల్‌, ఉపాధ్యాయలు తదితరులు ఉన్నారు.