బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 03, 2020 , 01:43:11

కనుల పండువగా బ్రహ్మోత్సవాలు

కనుల పండువగా బ్రహ్మోత్సవాలు

చివరి రోజూ భక్తజన సందడి

ప్రత్యేక పూజలు చేసిన మహిళలు

హుండీ ఆదాయం 3.90లక్షలు 

సిరిసిల్ల టౌన్‌: సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరిగాయి. చివరి రోజు సోమవారం ఆలయంలో నాకబలి, పుష్పయాగం, దేవతా ఉద్వాసన గ్రామబలి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు వేదమంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. సాయంత్రం 8గంటలకు ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈవో నాగపురి శ్రీనివాస్‌ పర్యవేక్షణలో స్వామివారి హుండీని లెక్కించారు. ప్రత్యేక దర్శనం, ప్రవేశ రుసం, అభిషేకం, హుండీల ద్వారా స్వామివారికి రూ.3.90,778 లక్షల ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు. ఇందులో మున్సిపల్‌ కౌన్సిలర్‌ పత్తిపాక పద్మ, ఉప్పల విఠల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నాగుల సంతోష్‌గౌడ్‌, కోడం శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు.