గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 03, 2020 , 01:12:02

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

ఆలయానికి పోటెత్తిన భక్తులు

20 వేల మంది రాక

వేములవాడ కల్చరల్‌: వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరా రు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌ ధరించి డిసిన్ఫెక్షనల్‌ టన్నెల్‌ ద్వారా లోపలికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. సత్యనారాయణ వ్రతాలు, కల్యాణం మొక్కులు, చండీహోమం, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను దాదాపు 20వేల మందికి పైగా దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ ఏఈ వో సంకెపల్లి హరికిషన్‌, పర్యవేక్షకులు శ్రీరాము లు, మహేశ్‌, ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్‌, శ్రీనివాసరెడ్డి, భూపతిరెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారిని టీవీ యాంకర్‌ కత్తి కార్తీక దర్శించుకున్నారు.