శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 02, 2020 , 01:58:25

నమో వేంకటేశా..వైభవంగా రథోత్సవం

నమో వేంకటేశా..వైభవంగా రథోత్సవం

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

స్వామి వారిని దర్శించుకున్న భక్తులు

గంభీరావుపేట: మండలంలోని లింగన్నపేట శ్రీ హరిహర దేవస్థానంలోని వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారిని ఉదయత్పూర్వం ఐదు అంతస్తుల రథంపై గ్రామంలో ఊరేగించారు. రథంపై నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ‘ఏడు కొండల వాడా.. వేంకటరమణా గోవిందా’ అంటూ భక్తులు పెద్దసంఖ్యలో రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమం లో అర్చకులు రామాచారి, రామశర్మ, రాధాకృష్ణశర్మ, గోపీకృష్ణ శర్మ, సర్పంచ్‌ దొంతినేని చైతన్య, ఉప సర్పంచ్‌ దుబాసి రాజు, సెస్‌ డైరెక్టర్‌ కొక్కు దేవేందర్‌ యాదవ్‌, ఎంపీటీసీ బిందె రేణుక, దేవాలయ కమిటీ అధ్యక్షుడు ఎల్లయ్య, నేతలు వంగ సురేందర్‌రెడ్డి, వెంకట్రావు, కృష్ణమూర్తి గౌడ్‌ పాల్గొన్నారు.