ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 02, 2020 , 01:35:05

వేములవాడలో సాధారణ రద్దీ

వేములవాడలో సాధారణ రద్దీ

 వేములవాడ కల్చరల్‌: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో సాధారణ రద్దీగా కనిపించింది. వేకువజాము నుంచే భక్తులు క్యూలైన్‌లో నిల్చొని స్వామివారికి కోడె మొక్కు తీర్చుకున్నారు. అనం తరం భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌ ధరించి డిస్‌ ఇన్‌ఫె క్షన్‌ టన్నెల్‌ ద్వారా లోపలికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

  ఐదు కిలోల వెండి గంగాళం

స్వామివారికి హుజూరాబాద్‌కు చెందిన మాడిశెట్టి ప్రసాద్‌ దంపతులు ఐదు కిలోల వెండి గంగాళాన్ని వితరణ చేశారు. అర్చకులు వారిని ఆశీర్వ దించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.