శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 02, 2020 , 01:35:05

చక్రస్నానం.. భక్తజన పునీతం

చక్రస్నానం.. భక్తజన పునీతం

సిరిసిల్ల టౌన్‌: శ్రీశాల శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నా యి. ఆదివారం ఆలయంలో మహా పూర్ణాహుతి, హోమం నిర్వహించారు. యేటా మానేరు వా గులో జరిగే చక్రస్నానం కార్యక్రమాన్ని కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ సారి ఆలయంలోనే నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన చక్రస్నానం కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోవిందనామస్మరణలతో ఆలయ ప్రాం గణం మార్మోగింది.ఈ  కార్యక్రమంలో ఆలయ ఈవో నాగారపు శ్రీనివాస్‌, ఉప్పల విఠల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కౌన్సిలర్‌ పత్తిపాక పద్మ, కొడం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.